శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (14:44 IST)

శ్రీకాకుళం కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్రం!!

కేంద్ర ప్రభుత్వం పిడుగులాంటి వార్తను చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించనున్నట్టు ప్రకటించింది. ఈ ప్లాంట్ శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో నిర్మిస్తామని మంగళవారం రాజ్యసభలో ప్రకటించింది. 
 
టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు బదులుగా కేంద్రం స్పష్టతను ఇచ్చింది. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ వద్ద ఈ ప్లాంటును నిర్మించబోతున్నామని... 1,208 మెగావాట్ సామర్థ్యం కలిగిన 6 అణు రియాక్టర్లను ప్లాంటులో ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. 
 
ఈ పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం అమెరికాకు చెందిన 'వెస్టింగ్ హౌస్ ఎలెక్ట్రిక్' సంస్థతో చర్చలు జరుపుతున్నామని తెలిపింది. పలు అధ్యయనాల తర్వాత కొవ్వాడ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్టు చెప్పింది.
 
కాగా, గతంలో కూడా ఇక్కడ అణు విద్యుత్ కర్మాగారం నిర్మించేందుకు ఆ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టగా స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇపుడు ఇదే ప్రాంతంలో ప్రధాని మోడీ సర్కారు ప్లాంట్ నిర్మాణం చేపట్టనున్నట్టు ప్రకటించింది.