శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 23 ఆగస్టు 2020 (11:48 IST)

అర్థరాత్రి దారుణం.. నిర్మాణంలో వంతెన కూలిపోయింది.. ఎక్కడ?

అర్థరాత్రి దారుణం జరిగింది. నిర్మాణంలో ఉన్న భారీ వంతెన ఒకటి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదం అర్థరాత్రి జరగడంతో అదృష్టవశాత్తు ప్రాణనష్టం సంభవించలేదు. ఈ దారుణం హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గురుగ్రామ్‌లో కొత్తగా ఓ వంతెన నిర్మిస్తున్నారు. ఇందులో కొంతభాగం ఒక్కసారిగా కుప్పకూలింది. అర్థరాత్రి సమయం కావడం ట్రాఫిక్ పెద్దగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించిన అధికారులు, శిథిలాల తొలగింపు పనులు చేపట్టారు.
 
కాగా, రాజీవ్ చౌక్ నుంచి గురుగ్రామ్‌లోని సోహ్నా వరకు 6 కిలోమీటర్ల పొడవున రూ.2 వేల కోట్ల వ్యయంతో ఈ ఫ్లైఓవర్‌ను నిర్మిస్తున్నారు. ఓరియంటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఈ నిర్మాణ పనులను చేపట్టింది. 
 
గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఫ్లై ఓవర్‌ ఎలివేటెడ్ రోడ్డు‌లోని కొంత భాగం కూలిపోయింద‌ని, దీనికారణంగానే ఈ ప్రమాదం సంభవించివుంటుందని ఓరియంటల్ కంపెనీ ప్రాజెక్ట్ హెడ్ శైలేష్ సింగ్ అభిప్రాయపడ్డారు.