సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (11:09 IST)

చలసాని శ్రీనివాస్‌ కుమార్తె శిరిష్మ ఆత్మహత్య..

ఆంధ్రా మేధావుల ఫోరం కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌ కుమార్తె శిరిష్మ (27) ఆత్మహత్యకు పాల్పడ్డారు. సంతానం లేకపోవడంతో కొన్నాళ్లుగా ఆమె తీవ్ర మనస్తాపంతో సతమతమవుతున్నట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆత్మహత్యకు అదే కారణమని భావిస్తున్నారు.
 
ప్రస్తుతం శిరిష్మ హైదరాబాద్‌లో ఇంటీరియర్‌ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. ఓయూ కాలనీలోని ట్రయల్‌ విల్లాస్‌లో నివసించే గ్రానైట్‌ వ్యాపారి సిద్ధార్థ్‌తో 2016 డిసెంబర్‌లో ఆమె వివాహం జరిగింది. ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఐకియా స్టోర్‌ సమీపంలోని ప్లాట్‌ 906-డిలో ఈ దంపతులు నివాసం ఉంటున్నారు. 
 
వివాహమై నాలుగేళ్లు గడిచినా సంతానం లేకపోవడంతో శిరిష్మ కొంతకాలంగా డిప్రెషన్‌లో ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో బుధవారం రాత్రి తన ఇంట్లోని ఓ గదిలో ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
 
శిరిష్మ భర్త సిద్దార్థ్ బుధవారం రాత్రి ఇంటికి చేరుకునేసరికి ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. వెంటనే ఆమె కుటుంబ సభ్యులకు అతను సమాచారమిచ్చాడు. ఆపై ఆస్పత్రికి తరలించగా... అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనను అనుమానాస్పద మృతిగా స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.