మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 మార్చి 2024 (13:51 IST)

మార్చి 19 నుంచి 21 వరకు మూడు రోజుల పర్యటన

Babu
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మార్చి 19 నుంచి 21 వరకు మూడు రోజుల పాటు తూర్పుగోదావరి జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. 
 
తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. మార్చి 19 నుంచి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా గళం పేరుతో భారీ ఎన్నికల ప్రచారం జరగనుంది. 
 
మార్చి 19న పి.గన్నవరం, రామచంద్రపురం, 20న కొవ్వూరు, అనపర్తి, 21న ప్రత్తిపాడు, పెద్దాపురంలో జరిగే ప్రజాగళం సభల్లో చంద్రబాబు ప్రసంగిస్తారు. మార్చి 20న రాజమహేంద్రవరం, 21న కాకినాడలో రోడ్‌షో నిర్వహించనున్నారు.