బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 9 మార్చి 2024 (15:52 IST)

ఎన్డీయేలోకి తెదేపా, జనసేన-బీజేపిలకు 30 అసెంబ్లీ, 8 లోక్ సభ స్థానాలు?

Pawan-Amit shah-Chandrababu
తెలుగుదేశం పార్టీని మరోసారి ఎన్డీయే కూటమిలోకి ఆహ్వానించింది భాజపా. పొత్తు ధర్మం ప్రకారం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా-జనసేన కలిసి 30 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్నాయి. ఇప్పటికే 24 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ తెలిపారు. కనుక మిగిలిన 6 అసెంబ్లీ స్థానాల్లో భాజపా బరిలోకి దిగనుంది. తెలుగుదేశం పార్టీ 145 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది.
 
ఇక లోక్ సభ స్థానాల విషయానికి వస్తే... టీడీపీ 17 ఎంపీ స్థానాల్లోనూ, భాజపా 6, జనసేన 2 స్థానాల్లో పోటీ చేస్తాయని సమాచారం. వైసిపిని గద్దె దించడమే లక్ష్యంగా మూడు పార్టీలు పరస్పరం పొత్తుకు అంగీకరించాయి. కాగా సీట్ల సర్దుబాటు విషయాన్ని ఈ రోజు సాయంత్రం అధికారికంగా వెల్లడిస్తారని తెలుస్తోంది.