సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 నవంబరు 2023 (11:54 IST)

అమరావతి నుంచి హైదరాబాద్‌కు చంద్రబాబు...

chandrababu
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మంగళవారం విడుదలైన ఏపీ విపక్ష నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం విజయవాడ, ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. అక్కడ నుంచి ఆయన వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్ నగరానికి చేరుకుంటారు. ఇందుకోసం ఆయన బుధవారం సాయంత్రం ఉండవల్లి నివాసం నుంచి ఆయన విజయవాడ ఎయిర్‌పోర్టుకు చేరుకుని, అక్కడ నుంచి విమానంలో హైదరాబాద్‌కు చేరుకుంటారు. 
 
మంగళవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన చంద్రబాబు... 14.30 గంటల సుధీర్ఘ ప్రయాణం తర్వాత బుధవారం ఉదయం ఆరు గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. నిజానికి ఆయన బుధవారం ఆయన తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకోవాల్సి ఉంది. కానీ, ఆయన తన ఆరోగ్యం దృష్ట్యా వైద్యుల సూచన మేరకు తిరుమల పర్యటనను రద్దు చేసుకుని, హైదరాబాద్‌కు సాయంత్రానికి చేరుకోనున్నారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేశారు. 
 
చంద్రబాబు షెడ్యూల్...
మధ్యాహ్నం 3 గంటలకు ఉండవల్లి నుంచి చంద్రబాబు బయలుదేరుతారు. 
3.45 గంటలకు విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరిక
4.00 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్‌కు పయనం
4.45 గంటలకు హైదరాబాద్ చేరిక
5.50 గంటలకు జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకుంటారు.