బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 11 మార్చి 2020 (11:50 IST)

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు ఏపీ మాజీ చంద్రబాబు లేఖ రాశారు. నామినేషన్ కేంద్రాల్లో భద్రత ఏర్పాటు చేయాలని, కొందరు పోలీసులు వైసీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రతిపక్షంపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. 
 
టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా వైసీపీ నేతలు అడ్డుకుంటుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. కొందరు పోలీసుల తీరుతో ఓటర్లు నమ్మకం కోల్పోతున్నారని, నామినేషన్‌ కేంద్రాల వద్ద పోలీస్‌ ఔట్‌పోస్ట్‌లు పెట్టాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతిపక్షం ఇచ్చే ప్రతి ఫిర్యాదు పట్ల పోలీసులు స్పందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.