శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 12 జులై 2019 (08:30 IST)

అప్పట్లో బ్రహ్మానందం- ఇప్పుడు చంద్రబాబు .. రాంగోపాల్ వర్మ సెటైర్లు

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబును చూస్తే బ్రహ్మానందం గుర్తుకువస్తున్నారని సెటైర్ వేశారు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఏపీలో విడుదల కాకుండా చంద్రబాబు అడ్డుకున్నప్పటి నుంచి రామ్ గోపాల్ వర్మ తరచూ చంద్రబాబును విమర్శిస్తున్నారు. అయితే తాజాగా ఏపీ అసెంబ్లీ సమావేశాలను ఉద్ధేశించి చంద్రబాబుపై కామెంట్ చేశారు వర్మ.
 
ఆంధ్రా అసెంబ్లీలో చంద్రబాబు ఎప్పుడు మాట్లాడినా సీఎం జగన్ నవ్వుతున్నారని, అయితే ఒకప్పుడు బ్రహ్మానందాన్ని చూసి జనాలు కారణం లేకుండా ఇలాగే నవ్వేవారని, ఇప్పుడు చంద్రబాబును చూస్తే అలాగే నవ్వుతున్నారని అన్నారు. ఇందుకుగాను ఆయన ట్వీట్ చేశారు.