శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 11 జూన్ 2017 (10:15 IST)

రాష్ట్రపతి పదవికి చంద్రబాబు అర్హుడు : ఎంపీ టీజీ వెంకటేష్

భారత రాష్ట్రపతి పదవికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని విధాలా అర్హుడని, అందువల్ల ఆయనను రాష్ట్రపతిగా ఎన్నుకోవాలని తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అభిప్రాయపడ్డారు. అ

భారత రాష్ట్రపతి పదవికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని విధాలా అర్హుడని, అందువల్ల ఆయనను రాష్ట్రపతిగా ఎన్నుకోవాలని తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అభిప్రాయపడ్డారు. అదేసమయంలో ఆయన స్థానంలో ఏపీ ముఖ్యమంత్రిగా నారా లోకేష్‌ను చేయాలని ఆయన సలహా ఇచ్చారు. 
 
ఆయన ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి బాధ్యతలను నారా లోకేష్‌కు అప్పగించాలని కోరారు. ముఖ్యమంత్రిగా లోకేష్‌ను కూర్చోబెట్టి, చంద్రబాబునాయుడు రాష్ట్రపతి పదవిని చేపట్టాలని సూచించారు. 
 
రాష్ట్రపతి పదవికి చంద్రబాబు నూటికి నూరు శాతం అర్హుడని అభిప్రాయపడ్డారు. పైగా, చంద్రబాబు పేరును ప్రకటిస్తే, ఒకటి, రెండు పార్టీలు మినహా మిగతా అన్ని పార్టీలూ ఏకగ్రీవంగా అంగీకరిస్తాయని తెలిపారు.