సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 7 ఆగస్టు 2020 (17:21 IST)

చంద్రబాబు నాయుడు కుట్రలపై ముందే అంచనా: మంత్రి పేర్ని నాని

రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పలు కుట్రలకు పాల్పడుతారని తాము ముందే అంచనా వేసినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నాని చెప్పారు.

"చంద్రబాబు కుట్రలు అన్నింటినీ అధికారంలోకి రాక ముందే మేము ఊహించాం. ఆయన ఏ విధంగా వ్యవస్థలని మేనేజ్ చెయ్యగలడో అందరికీ తెలుసు. వాటన్నిటినీ అధిగమించి ముందుకు వెళ్తాం తప్ప వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు.

ఇంతకు ముందు చెప్పినట్టుగానే కచ్చితంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం" అని చెప్పారు. చంద్రబాబు నాయుడిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు గుప్పించారు.