సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Updated : శనివారం, 15 జూన్ 2019 (11:03 IST)

గన్నవరం ఎయిర్ పోర్టులో చంద్రబాబు కు అవమానం..మండిపడుతున్న తమ్ముళ్లు..

ఏపీ మాజీ మఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు గన్నవరం విమానాశ్రయంలో ఘోర  అవమానం జరిగింది. శుక్రవారం సాయంత్రం విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరేందుకు చంద్రబాబు గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడ భద్రతా సిబ్బంది చంద్రబాబును తనిఖీ చేశారు. 
 
చంద్రబాబు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న నేపథ్యంలో  ఆయన వాహనం వీఐపీ మార్గం నుంచి విమానం వరకు వెళ్లే వెసులుబాటు ఉంది. అయినా సరే ఆయన వాహనాన్ని కూడా విమానాశ్రయం లోనికి అనుమతించలేదు. ఎయిర్ పోర్ట్ లాంజ్ నుంచి విమానం వరకు చంద్రబాబునాయుడు కూడా సాధారణ ప్రయాణికుడిలా బస్సులోనే వెళ్లారు. అయితే ఈ తనికీలపై  టీడీపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్దేశ పూర్వకంగా ఇటువంటి చర్యలు  చేపడుతున్నారన్న  అభిప్రాయం వ్యక్తం చేస్తన్నాయి. 
 
ప్రతి పక్ష నేతగా ఉన్న సమయంలో ఈ తరహా తనికీలు గతంలో చేయలేదని, మాజీ ముఖ్యమంత్రి  హోదాలో  జెడ్ కేటగిరీ రక్షణ ఉన్న నేతకు ఇటు వంటి తనికీలు ఉండవన్నది తెలుగుదేశం నేతలు వాపోతున్నారు.


ఇప్పటికే చంద్రబాబు కాన్వాయ్‌లో పైలెట్‌ వాహనం తొలగించడం, ట్రాఫిక్ సర్కిల్  క్లియరెన్స్‌ చేయకపోవడం  వెనుకు రాజకీయ కారణలు ఉన్నాయని అంటున్నారు. అయితే తాజా పరిణామాలను అధినేత దృష్టికి తీసుకెళ్లారు కొందరు నేతలు.చంద్రబాబు  మరి కొంత కాలం  వేచి చూసి అప్పుడు స్పందిద్దాం అన్నట్టు సమాచారం.