మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 7 జూన్ 2019 (14:36 IST)

బంపర్ ఆఫర్ : యేడాది పాటు ఉచితంగా బిర్యానీ... ఎక్కడ.. ఎందుకు?

హైదరాబాద్ నగరం బిర్యానీకి ప్రసిద్ధి. హైదరాబాద్ బిర్యానీకి ఉన్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో ఈ నగరంలో ఉన్న ప్యారడైజి బిర్యానీ గురించి వివరించాల్సిన పనిలేదు. అయితే, ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ పోటీలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నగరంలోని ప్యారడైజ్ హోటల్ ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది.
 
ప్రపంచకప్‌ 2019 టోర్నీ నేపథ్యంలో క్రికెట్‌ ప్రియులకు కోసం #WorldCupWithParadise అనే పోటీని నిర్వహించనుంది. ఇందులో విజేతలుగా నిలిచిన వారికి ఒక యేడాది పాటు వారంలో ఒక బిర్యానీ చొప్పున 52 వారాలు ఉచితంగా బిర్యానీని గిఫ్ట్ రూపంలో పొందవ‌చ్చ‌ు. ఈ పోటీ జూన్ 7 నుంచి జూలై 18వ తేదీ 2019 వ‌ర‌కు దేశవ్యాప్తంగా నిర్వ‌హించనున్నట్టు హోటల్ నిర్వహాకులు ఓ ప్రకటనలో వెల్లడించారు. 
 
బిర్యానీ ప్రియులు ఈ నిర్ణీత సమయంలో ప్యార‌డైజ్ ఫుడ్ కోర్టుల డైన్ ఇన్/ఎక్స్‌ప్రెస్ ఔట్‌లెట్‌ల‌కు కుటుంబం, స్నేహితుల‌తో విచ్చేసి ఈ పోటీ గురించి వివ‌రంగా తెలుసుకోవ‌చ్చని స్పష్టం చేసింది. ఈ క్రికెట్‌ సీజన్‌ తమ వినియోగదారులకు ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈపోటీని తీసుకువచ్చినట్లు సంస్థ సీఈవో గౌతం గుప్తా తెలిపారు. ఇక ఐపీఎల్‌ సందర్భంగా ప్యారడైజ్‌ రెగ్యులర్‌ కస్టమర్లకు ఉచితంగా బిర్యానీతో పాటు ఐపీఎల్‌ టికెట్లు అందజేసిన విషయం తెలిసిందే.