సిగరెట్ ఇవ్వలేదని షాపు యజమానిపై కత్తితో దాడి...
హైదరాబాదు హుమయున్ నగర్ పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. హుమాయున్ నగర్ పిఎస్ పరిధిలోని మల్లేపల్లి రియాన్ హోటల్ వద్ద కిళ్ళీ కొట్టు నిర్వహిస్తున్నాడు కాజా జియావుద్దీన్. రాత్రి కావడంతో తన కిల్లీ కొట్టును మూసివేసే సమయంలో అదే మల్లేపల్లి ప్రాంతంలో నివాసముండే షేక్ హాసన్ తనకు సిగరెట్ కావాలంటూ షాపు దగ్గిరకి వచ్చాడు.
సమయం మించిపోవడంతో షాపు మూయడం జరిగిందని చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. కాజా జియావుద్దీన్ తన షాపు మూసివేసాను ఇప్పుడు ఇవ్వడానికి కుదరదని కరాఖండిగా చెప్పడంతో షేక్ హుస్సేన్ తన వెంట తెచ్చుకున్న కత్తితో కాజా జియావుద్దీన్ పైన దాడికి పాల్పడ్డాడు.
ఈ దాడిలో కాజా జియావుద్దీన్‌కు గొంతుపైన, ఎడమ చేతికి తీవ్ర గాయాలు కావడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న హుమాయున్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. షేక్ అస్సన్ పరారీలో ఉన్నట్లు హుమాయున్ నగర్ ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. నిందితునిపై సెక్షన్ 307, 324 కేసుల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.