శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 1 జనవరి 2023 (09:35 IST)

నేడు గుంటూరులో చంద్రన్న కానుక పంపిణీ...

chandrababu
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదివారం గుంటూరులో పర్యటించనున్నారు. గుంటూరు సదాశివ నగరులోని వికాస్ హాస్టల్ మైదానంలో జరిగే చంద్రన్న కానుక పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఉయ్యూరు ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు అన్నగారి జనతా వస్త్రాలు, చంద్రన్న  సంక్రాంతి కానుకలను పంపిణీ చేస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు ఈ కార్యక్రమం జరుగనుంది. 
 
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఏపీలో చంద్రన్న కానుక పేరుతో ప్రజలకు నిత్యావసర సరకుల్ని పంపిణీ చేసింది. ప్రభుత్వం మారిన తర్వాత ఆ పథకాన్ని రద్దు చేసింది. అయితే, అధికారంలో లేకపోయినప్పటికీ టీడీపీ ఆధ్వర్యంలో వివిధ ట్రస్టుల ద్వారా పేదలకు జనతా వస్త్రాలతో పాటు చంద్రన్న కానుకలను పంపిణీ చేస్తుంది. 
 
గుంటూరు సదాశివ నగరులోని వికాస్ హాస్టల్ మైదానంలో జరిగే ఈ కార్యక్రమంలో దాదాపు 30 వేల మందికి వీటిని అందజేయనున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొని వీటిని అందచేస్తారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు.