శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 10 జూన్ 2024 (11:14 IST)

కింగ్‌ఫిషర్ రిటర్న్స్.. నెటిజన్ల సైటెర్లు.. బాబు హామీ అలా నెరవేరిందా?

beer
మాజీ సీఎం జగన్ హయాంలో నిషేధం తర్వాత, ప్రసిద్ధ కింగ్‌ఫిషర్ బీర్ ఆంధ్రప్రదేశ్‌లో తిరిగి వచ్చింది. యునైటెడ్ బ్రూవరీస్ ఉత్పత్తిని పునఃప్రారంభించింది. చాలామంది ఆంధ్రా నివాసులకు టోస్ట్ పెంచింది. చీర్స్.. జగన్ ఘోర పరాజయానికి చీప్ లిక్కర్ అని ముద్రపడిన జగన్ బ్రాండ్స్ కూడా ఒక కారణంగా నిలిచాయి. 
 
దేశంలో పాపులర్ బ్రాండ్‌గా ఉన్న కింగ్ ఫిషర్ బీర్‌ను కంటైనర్లలో తీసుకువచ్చి గోడౌన్‌లలో నిల్వ చేశారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా బ్రాండెడ్ మద్యం విక్రయాలు ప్రారంభం కాబోతున్నాయి. 
 
ఈ మేరకు కింగ్ ఫిషర్ బీర్లతో వచ్చిన కంటైనర్ వీడియోను టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి ట్వీట్ చేశారు. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ అవుతోంది.  మొత్తం మీద చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లే.. నాణ్యమైన మద్యం అందుబాటులోకి రాబోతుందనే చర్చ జరుగుతోంది.
 
మొన్నటి వరకు తెలంగాణలో టాప్ బ్రాండ్ లిక్కర్, కింగర్ ఫిషర్ బీర్లు దొరికితే.. ఏపీలో విచిత్రమైన బ్రాండ్లతో లిక్కర్, బీర్లు దొరికేవి. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు సరదాగా చర్చించుకుంటున్నారు. ఏపీలో లిక్కర్, బీర్లకు తెలంగాణలో డిమాండ్ పెరుగుతుందంటూ సెటైర్లు పేలుస్తున్నారు.