1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 డిశెంబరు 2023 (20:01 IST)

మైచాంగ్ తుఫాను-ముగ్గురు గిరిజనులు కొట్టుకుపోయారు..

flood water
మైచాంగ్ తుఫాను కారణంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసాయి. ఈ తుఫాను కారణంగా పలు చోట్ల వరదలు ముంచెత్తాయి. ఈ వరదల కారణంగా పలు చోట్ల ప్రజలు ప్రాణాలను కోల్పోయారు. ఈ వరద తాకిడి ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాకు కూడా తాకింది. ఈ నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలను కోల్పోయారు.
 
వివరాల్లోకి వెళ్తే.. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని లవ్వ గడ్డలో తుఫాను కారణంగా వరద విలయ తాండవం చేసింది. ఈ నేపథ్యంలో ముగ్గురు గిరిజనులు సమీపంలోని గోస్తిని నదిలో కొట్టుకుపోయారు. అనంతరం నదిలో కొట్టుకుపోయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఇద్దరి మృత దేహాలను నదిలో నుండి వెలికి తీశారు.