గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 డిశెంబరు 2023 (19:04 IST)

మిగ్‌జాం తుఫాను: హెలికాప్టర్ల ద్వారా ఆహార ప్యాకెట్లు

mandous cyclone
మిగ్‌జాం తుఫాను భీకర గాలులు, కుండపోత వానతో చెన్నైలోని అనేక ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. నగరంలో కురిసిన భారీ వర్షాల ధాటికి జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లపైకి వరదనీరు రావటంతో కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి. చాలా ప్రాంతాల్లో వరద నీరు ఇంకా తొలగిపోలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజులుగా కరెంటు, ఆహారం, నీరు లేక అల్లాడుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో వరదల్లో చిక్కుకున్న వారికి హెలికాప్టర్ల ద్వారా భారత వాయు సేన ఆహార ప్యాకెట్లను అందజేస్తోంది. కొందరు సినీ నటులు, స్వచ్ఛంద సేవా సంస్థలు సైతం నగరంలో వరదల్లో చిక్కుకున్న వారికి తమ వంతు సాయం అందిస్తున్నారు.