సోమవారం, 16 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 27 జూన్ 2024 (15:55 IST)

అమరావతి రాజధాని నిర్మాణం కోసం చిత్తూరు డ్వాక్రా మహిళలు రూ.4.5 కోట్లు విరాళం (video)

Rs.4.5 crores for the construction of Amaravati capital
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటికే మెడికో చదవుతున్న యువతి 25 లక్షల రూపాయలు ఇచ్చి రాజధాని నిర్మాణం కోసం తన వంతు సాయం అందించారు. తాజాగా చిత్తూరు జిల్లాకు చెందిన డ్వాక్రా మహిళలు భారీ విరాళాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అందించారు.
 
చిత్తూరు జిల్లాకు చెందిన 4 లక్షల మంది డ్వాక్రా మహిళలు తమవంతు విరాళాలు సేకరించి నాలుగున్నర కోట్ల రూపాయలుని విరాళంగా అమరావతి రాజధాని నిర్మాణం కోసం సీఎంకి అందించారు.
 
ప్రజలు ఇలా స్వచ్ఛందంగా విరాళాలు అందిస్తుంటే ఇక అమరావతి రాజధాని నిర్మాణం పూర్తవ్వడం ఎంతో కాలం పట్టదు.