విశాఖ గాజువాక స్టీలు ఫ్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద సి.ఐ.టి.యు అధ్వర్యంలో ధర్నా
స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై ఇంకా ఉద్యమం నడుస్తూనే ఉంది. ఒక పక్క ప్రయివేటీకరణ సమస్యకు తోడు ఇపుడు కార్మికులు తమ కార్మిక చట్టాలు, ఇతన నిబంధనలపై తమ నిరసనలు ప్రారంభించారు. తమకు చట్టపరంగా రావాల్సిన హక్కుల కోసం ఉద్యమాన్ని ప్రారంభించారు. విశాఖ గాజువాక స్టీలు ఫ్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద సి.ఐ.టి.యు అద్వర్యంలో ధర్నానిర్వహించారు. స్టీలు కార్మికులకు నష్టదాయకమైన యం.ఓ.యు ( మెమరాడింగ్ ఆఫ్ అండాస్టాడింగ్ )లో మార్పులు చెయ్యాలని కార్మికులు డిమాండు చేస్తున్నారు.
స్టీల్ అధారిటీ ఆఫ్ ఇండియా సైల్ మాదిరిగా స్టీలు ఫ్లాంట్ కార్మికులకు ఏరియర్స్ చెల్లించాలని డిమాండు చేస్తున్నారు. ఈ ధర్నాలో సి.ఐ.టి.యు, బి.ఎం.ఎస్. జె.ఎం.ఎస్, ఎఐసిటియు, విఎస్ ఎం ఎస్., తదితర కార్మిక సంఘాలు ఈ ధర్నాలో పాల్గొన్నాయి. దర్నా జరుగుతున్న సమయంలో టి.యన్ .టి.యు.సి , డి. వి. ఆర్ .కార్మిక సంఘాల మద్య తొపులాట జరిగింది. పెద్ద గొడవ కాకుండా వారిని ఇతర కార్మిక నాయకులు వారించారు.