గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 సెప్టెంబరు 2024 (13:25 IST)

తెలంగాణ హైడ్రా చట్టాన్ని ఏపీకి తీసుకొస్తాం.. చంద్రబాబు నాయుడు

Chandra babu
Chandra babu
విజయవాడ-బుడమేరు పరివాహిక ప్రాంతాల్లో లోతట్టు ప్రదేశాలలో నివసిస్తున్న ప్రజలు వరద ముంపు ఉండటం వలన వెంటనే సురక్షిత ప్రదేశాలకు తరలిరావాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం ఉదయం ఆదేశాలు జారీ చేశారు.
 
ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా 8వ రోజు విజయవాడలోని ముంపు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. కుమ్మరిపాలెం జంక్షన్, సితార సర్కిల్, చిట్టానగర్, మిల్క్ ప్రాజెక్ట్ మీదుగా జక్కంపూడి వెళ్లారు. ఆయా ప్రాంతాల్లో వరద సహాయక కార్యక్రమాలపై బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. 
 
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలంగాణలో అమలులో ఉన్న ఆపరేషన్ హైడ్రా తరహాలో చట్టాన్ని తీసుకొచ్చి బుడమేరు అక్రమాలను తొలగిస్తామని హెచ్చరించారు. కొంతమంది ఆక్రమణల కారణంగా.. లక్షలాది మంది ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోమని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.