బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 23 డిశెంబరు 2021 (23:19 IST)

ఇంటిగ్రేటెడ్‌ ఉడ్‌ ప్యానెల్‌ తయారీ కేంద్రం కోసం శంఖుస్థాపన చేసిన ముఖ్యమంత్రి జగన్‌

ఉడ్‌ప్యానెల్‌, డెకరేటివ్‌ ఇండస్ట్రీలో అతిపెద్ద తయారీదారునిగా నిలిచిన సెంచురీ ప్లైబోర్డ్స్‌ (ఇండియా) లిమిటెడ్‌ నేడు కంపెనీ యొక్క నూతన, అతిపెద్ద ఇంటిగ్రేటెడ్‌ ఉడ్‌ ప్యానెల్‌ తయారీ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలోని గోపవరం వద్ద ప్రారంభించేందుకు శంఖుస్థాపన చేసినట్లు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో పాటుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య మరియు ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖామాత్యులు శ్రీ మేకపాటి గౌతమ్‌ రెడ్డి మరియు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ శ్రీ ఆర్‌ కరికల్‌ వలవేన్‌, ఇతర ముఖ్య అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 
అపారమైన వనరులు కలిగి ఉండటం చేత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పారిశ్రామిక చిత్రపటంలో వైఎస్‌ఆర్‌ కడప జిల్లా ఓ ప్రత్యేకస్థానం కలిగి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని అనుకూలమైన వ్యవసాయ-పారిశ్రామిక కేంద్రంగా గుర్తించింది. సెంచురీ ప్లై ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్‌, ఈ ప్రాంతంలో వరుసగా ఇతర పారిశ్రామిక సంస్థల నుంచి రాబోయే పెట్టుబడులకు ప్రారంభ సూచికగా నిలుస్తుంది. చివరకు, వైస్‌ఆర్‌ కడప జిల్లా దేశం మొత్తానికీ ఓ ముఖ్యమైన ఫర్నిచర్‌ కేంద్రంగా మారేందుకు దారితీయనుంది.

 
సెంచురీప్లై నూతనంగా నిర్మించబోయే కర్మాగారం, సంస్థకు అంతర్జాతీయంగా అతిపెద్ద కర్మాగారంగా మలిచేందుకు ప్రణాళిక చేశారు. ఈ ప్రాంతంలో వ్యాపార వాతావరణాన్ని ఇది సమూలంగా మార్చనుంది. ఈ ప్లాంట్‌ నిర్మాణంలో భాగంగా మొదటి దశలో 800 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనున్నారు. మొత్తంమ్మీద ఈ ప్రాజెక్ట్‌లో 1600కోట్ల రూపాయలను  పెట్టుబడిగా పెడతారు. తద్వారా ప్రత్యక్షంగా 2 వేల మందికి, పరోక్షంగా 4 వేల మంది ప్రజలకు జీవనోపాధిని అందించనున్నారు.

 
ఈ ప్రతిష్టాత్మక పెట్టుబడుల ద్వారా ఎక్కువ మొత్తంలో లాభపడేది స్ధానిక రైతులు. స్థానికంగా ఉత్పత్తి అయ్యే ముడి పదార్థాలను సెంచురీ ప్లై నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేయనుంది. దీనిద్వారా ఈ కర్మాగారంలో కార్యకలాపాలు ఆరంభించిన తొలి రోజు నుంచే రైతుల ఆదాయం కనీసం 50%కు పైగా వృద్ధి చెందనుంది.

 
గోపవరంలో ఒక లక్ష ఎకరాలలో తోటల పెంపకం చేయాలనే ప్రభుత్వ లక్ష్య సాకారానికీ ఇది ప్రతీకగా నిలుస్తుంది. సెంచురీ ప్లైతో కలిసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం మార్చడంతో పాటుగా సుస్థిర అభివృద్ధి పరంగా నూతన బెంచ్‌మార్క్‌గా ఈ జిల్లాను మార్చడానికి ఇది నాందిగానూ నిలుస్తుంది.

 
ఈ సందర్భంగా సెంచురీ ప్లై ఛైర్మన్‌ శ్రీ సజ్జన్‌ భజంకా మాట్లాడుతూ, ‘‘ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వంతో భాగస్వామ్యం చేసుకుని ఈ జిల్లాలో మొట్టమొదటి ఉడ్‌ ప్యానెల్‌ తయారీ కర్మాగారం ఏర్పాటుచేయడంతో పాటుగా ఆంధ్రప్రదేశ్‌లోని  వ్యవసాయపారిశ్రామిక కేంద్రంగా గోపవరం ను అభివృద్ధి చేసేందుకు తోడ్పాటునందించడాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నాము. మొదటి దశలో ఎండీఎఫ్‌లో 600 కోట్ల రూపాయలు, లామినేట్స్‌లో 200 కోట్ల రూపాయలను మేము పెట్టుబడిగా పెట్టనున్నాము. రెండవ దశలో 200 కోట్ల రూపాయలను ప్లైవుడ్‌  మరియు 600 కోట్ల రూపాయలను పార్టికల్‌ బోర్డ్‌ వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టనున్నాము. ఈ మొత్తం పెట్టుబడులతో, ప్రత్యక్షంగా 2వేల మందికి మరియు పరోక్షంగా 4వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి.  ఈ కర్మాగార నిర్మాణం డిసెంబర్‌ 2024 నాటికి పూర్తవుతుందని అంచనా’’ అని అన్నారు.