శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ , శనివారం, 1 జనవరి 2022 (18:12 IST)

మేనిఫెస్టో మొత్తం చేస్తున్నా; జ‌గ‌న్; ప్ర‌జ‌ల్లో తిరుగుబాటు; చంద్ర‌బాబు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అపుడే సాధారణ ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. ఎన్నిక‌ల మ్యానిఫెస్టోలో చెప్పిందంతా చేసేస్తున్నామ‌ని సీఎం జ‌గ‌న్ చెపుతున్నారు. వాటికి మూడు రెట్లు ప్ర‌జ‌ల‌పై భారం వేస్తున్నార‌ని చంద్ర‌బాబు విమ‌ర్శిస్తున్నారు.
 
 
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. ‘‘అధికారంలోకి రాగానే పింఛన్‌ ₹2,250కి పెంచాం. రెండున్నరేళ్లలో ఇవాళ ₹2,500కు పింఛన్‌ పెంచుతున్నాం. మధ్యాహ్నం నుంచే వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పింఛన్‌ అందిస్తారు. ఎవరైనా.. మంచి పాలన కోసం ఆరాటపడతారు. అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామని గర్వంగా చెబుతున్నాను. మంచి చేస్తుంటే విమర్శించేవాళ్లు కూడా ఉంటారు. విమర్శించేవాళ్లకు మేం చేసే అభివృద్ధి కనిపించట్లేదా? పింఛన్‌ ₹3వేలకు పెంచుతామన్న మాట నిలబెట్టుకుంటాం’’ అని జగన్‌ తెలిపారు.
 
 
ఏపీలో వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు స్పష్టంగా కనిపిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. సీఎం జగన్‌ అడిగిన ఒక్క అవకాశం ప్రజలిచ్చారని.. వారి భ్రమలు తొలగిపోయాయన్నారు. సంక్షేమం కింద ఇచ్చేదాని కంటే ప్రజలపై మోపే భారం 3 రెట్లు ఎక్కువని ఆరోపించారు. ఆదాయం, ఖర్చును ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని తెలిపారు. వివిధ సంస్థల విశ్వసనీయత, బ్రాండ్‌ ఇమేజ్‌ను సీఎం దెబ్బతీశారని చంద్రబాబు ధ్వజమెత్తారు.