శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 ఆగస్టు 2020 (11:56 IST)

శ్రీశైలం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తెలుగు సీఎంలు

శ్రీశైలం ఎడమగట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో షాట్ సర్క్యూట్ కారణంగా గురువారం రాత్రి భారీ ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. ప్రమాద సమయంలో 17మంది ఉద్యోగులు విధుల్లో ఉన్నారు. వారిలో ఎనిమిది మంది సొరంగం నుంచి క్షేమంగా బయటపడ్డారు.
 
మిగిలిన తొమ్మిదిమంది సిబ్బంది విద్యుత్‌ కేంద్రంలోనే చిక్కుకుపోయారు. దీంతో అధికారులు వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు. వీరిలో ఏడుగురు జెన్‌కో ఉద్యోగులు కాగా, ఇద్దరు అమ్రాన్ కంపెనీకి చెందిన సిబ్బంది ఉన్నారు.
 
ఈ నేపథ్యంలో శ్రీశైలం జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో అగ్నిప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ప్లాంట్‌లో చిక్కుకున్న వారు క్షేమంగా తిరిగిరావాలని సీఎం కోరుకున్నారు. ప్లాంట్ వద్ద ఉన్న మంత్రి జగదీష్ రెడ్డి, సీఎండీ ప్రభాకర్ రావుతో మాట్లాడిన సీఎం కేసీఆర్ అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు.
 
మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు శ్రీశైలం సందర్శించే అవకాశం ఉంది. ఈ మేరకు సంబంధిత ఇరిగేషన్.. కర్నూలు జిల్లా అధికారులకు సమాచారం అందింది. రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి అవంతి శ్రీనివాస్ టూరిజం పాలసీ గురించి చర్చించిన సందర్భంగా శ్రీశైలం డ్యామ్‌కు వరద పోటెత్తుతోందన్న అంశం ప్రస్తావనకు వచ్చింది. 
 
మరో రెండు గేట్లు అంటే.. 7 గేట్లు ఎత్తుతున్నట్లు .. ఈ  నేపధ్యంలో  సీఎం జగన్ కూడా రేపు ఉదయం శ్రీశైలం వెళ్లనున్నట్లు సమాచారం అందింది.  రేపు ఉదయం ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి శ్రీశైలం వెళ్లనున్న వైఎస్ జగన్ డ్యామ్ ను సందర్శించే అవకాశ ఉంది. అక్కడే ఇరిగేషన్ అధికారులతో ఎస్ జగన్ సమీక్షించే అవకాశం ఉంది. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు..  టెండర్ల ప్రక్రియ…  తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలు.. తదితర అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి జగన్ చర్చించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.