సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 8 జూన్ 2019 (12:57 IST)

సీఎం జగన్ ఛాంబర్ చూస్తే షాకవ్వాల్సిందే.. గోడలపై ఏమున్నాయంటే...

వైకాపా అధినేత, నవ్యాంధ్ర కొత్త ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి శనివారం సచివాలయంలోకి అడుగుపెట్టారు. గత నెల 30వ తేదీన నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్.. ఇప్పటివరకు సచివాలయంలో అడుగుపెట్టలేదు. ఈ క్రమంలో శనివారం ఉదయం 8.39 నిమిషాలకు ఆయన సచివాలయంలోని తన ఛాంబర్‌లో అడుగుపెట్టారు.
 
అయితే, ఈ ఛాంబర్‌లోకి వెళ్లిన వైకాపా అగ్రనేతలతో పాటు.. అధికారులకు ఒకింత షాక్‌కు గురయ్యారు. ఛాంబర్‌లోని నాలుగు గోడలకు తన ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలను అందమైన చిత్రాలుగా మలిచి గోడలకు అంటించారు. తాను కూర్చొనే సీటుకు కుడివైపున తన తండ్రి దివంగత వైఎస్.రాజశేఖర్ రెడ్డి నిలువెత్తు చిత్రపటాన్ని ఉంచారు.
 
తన ఛాంబర్‌లో పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను అందమైన చిత్రాల రూపంలో మలిచి నాలుగు గోడలకు అంటించడంలో ఆంతర్యం లేకపోలేదు. ప్రతీక్షణం ఎన్నికల హామీలను గుర్తించుకుని పని చేయడానికి ఇలా చేసినట్టుగా చెప్పకనే చెబుతున్నాయి. వీటిని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపడగా, జగన్ అభిమానులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.