బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 11 జులై 2020 (20:02 IST)

క్వారంటైన్ కేంద్రాల్లో సదుపాయాలు లేకుంటే 1800-2332077 నెంబరుకి డయల్ చేయండి: ఏపీ మంత్రి

రాష్ట్ర స్థాయిలో క్వారo టైన్ సెంటర్ లో ఉంటున్న కరోనా బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య సదుపాయాలు కల్పించడానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి అదేశిoచినట్టు ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు.

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని బీమవరం, తాడేపల్లిగూడేo, ఏలూరు ఆశ్రమం హాస్పిటల్ క్వారంటైన్ లో కరోనా బాధితులతో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని శనివారం మాట్లాడారు.

క్వారంటైన్ సెంటర్ లో ఉంటున్న కరోనా బాధితులకు ఏ ఇబ్బంది వచ్చినా ఫోన్ చేసి మీ సమస్యలు తన దృష్టికి తీసుకురావొచ్చని, లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800-2332077కు పిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. పలువురు కరోనా బాధితులతో మంత్రి ఆళ్ల నాని మాట్లాడి వారి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు.

భోజనం సమయానికి పెడుతున్నారా, మీరు ఉంటున్న రూమ్స్ ప్రతి రోజు శుభ్రం చేస్తున్నారా, శానిటేషన్ ఏ విధంగా ఉంది, బాత్ రూమ్స్ పరిశుభ్రం చేస్తున్నారా? అని ప్రతి అంశాన్ని అడిగి వారి సాధక బాధలను తెలుసుకున్నారు. పలువురు బాధితులు క్వారంటైన్ సెంటర్లో పడుతున్న అవస్థలు క్షణ్ణంగా మంత్రి ఆళ్ల నానికి వివరించారు.

ఈ సందర్బంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేకంగా క్వారంటైన్ సెంటర్స్ లో కరోనా బాధితులకు అన్ని విధాలుగా అండగా నిలవాలని స్పష్టమైన అదేశాలు ఇచ్చారని, బాధితులకు సకాలంలో వైద్యం అందించడానికి అన్ని చర్యలు తీసుకుటున్నామన్నారు.

ప్రతి కోవిడ్ హాస్పిటల్ లో ఫిజీషియన్, పల్మనాజిస్తు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచామని, ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా కరోనా కట్టడికి అన్ని విధాలుగా చర్యలు తీసుకునే విధంగా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని, వచ్చే వారం నుండి కరోనా టెస్ట్ లు రిపోర్ట్ త్వరలో రావడానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలియజేసారు.

జిల్లాలో అన్ని ప్రాంతాలకు కరోనా ఐ మాస్క్ బస్సులను అందుబాటులో ఉంచుతున్నామని ప్రజలు వచ్చి కరోనా టెస్ట్ లు చేయిoచుకోవాలని, జిల్లాకు నాలుగు బస్లను ప్రభుత్వం కేటాయించిoదని, ప్రస్తుతం రెండు బస్సులు జిల్లాకు వచ్చాయని, మిగిలిన రెండు బస్సులు కూడా త్వరలో వస్తాయని పేర్కొన్నారు.