శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 జూన్ 2020 (10:53 IST)

విజయవాడలో లాక్‌డౌన్ ఉత్తర్వులు విత్ డ్రా.. ఎందుకు?

కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ నిర్ణయం హాట్ టాపిక్‌గా మారింది. వియవాడలో పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధిస్తున్నామని చెప్పిన ఆయన కాసేపట్లోనే నిర్ణయాన్ని మార్చుకున్నారు. పూర్తి స్థాయి లాక్ డౌన్ లేదని తేల్చేశారు. జూన్ 26 నుంచి వారం రోజులపాటు విజయవాడలో లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్లు జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకున్నారు.

తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఇప్పుడున్న పరిస్థితులే ఉంటాయని కలెక్టర్ చెప్పారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో విజయవాడలో పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించాలని తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ప్రకటించారు. 
 
అయితే అనంతపురం, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో లాస్ట్ ఆదివారం (జూన్ 21,2020) నుంచి లాక్ డౌన్ మళ్లీ అమల్లోకి తెచ్చారు. ఆదివారం నుంచి నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఆయా జిల్లాల్లో రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతుండటతో అధికారులు అప్రమత్తమయ్యారు.

కరోనా కట్టడిలో భాగంగా మూడు జిల్లాల్లో మళ్లీ లాక్ డౌన్ అమలు చేశారు. ప్రజలు లాక్ డౌన్ నిబంధనలు పాటించి కరోనా కట్టడికి సహకారం అందించాలని అధికారులు కోరుతున్నారు.