ఏపీలో స్కై రాకెట్‌లా పెరుగుతున్న కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ అదుపులో ఉందనీ, తాము తీసుకుంటున్న చర్యలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని పాలకులు చెప్పుకుంటూ వచ్చారు. అయితే, రెండు రోజుల్లో ఈ కథ అడ్డంతిరిగింది. కేవలం రెండు మూడు రోజుల్లోనే ఈ వైరస్ కేసుల సంఖ్య ఏకంగా 87కు చేరుకున్నాయి. ముఖ్యంగా, ఒక్క రోజునే ఈ సంఖ్య రెట్టింపు అయింది. వీటిలో అత్యధికంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన కడపలో నమోదుయ్యాయి.
ప్రస్తుతంక కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో జిల్లా వారీగా పరిశీలిస్తే, కడపలో 15, వెస్ట్ గోదావరి జిల్లాలో 13, చిత్తూరులో 5, ప్రకాశంలో 4, ఈస్ట్ గోదావరి జిల్లాలో 2, విశాఖపట్టణం, కృష్ణా జిల్లాలో ఒకటి చొప్పున నమోదైంది. అయితే, కొత్తగా వైరస్ సోకినవారంతా ఢిల్లీ, నిజాముద్దీన్‌లో జరిగిన మర్కజ్ మతపరమైన కార్యక్రమానికి వెళ్లారా లేదా అన్నది అధికారులు నిర్ధారించాల్సివుంది.