గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

ఆరు బయట నిద్రిస్తున్న దంపతులపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు

rtcbus catch fire
అనంతపురం జిల్లా తాడిపత్రిలో దారుణం జరిగింది. ఆరు బయట నిద్రిస్తున్న దంపతులపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ప్రమాదంలో వారు తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో పక్కనే నిద్రిస్తున్న మరో బాలికకూ కూడా తీవ్ర గాయాలయ్యారు. ఇరుగుపొరుగువారు బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
 
ఈ దారుణ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. తాడిపత్రి మండలంలోని సజ్జలదిన్నెలో శుక్రవారం అర్థరాత్రి ఆరుబయట నల్లపురెడ్డి, కృష్ణవేణిలతో పాటు సమీపంలో పూజిత అనేక బాలిక నిద్రిస్తుండగా, కొందరు దుండగులు దంపతులపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో వారు కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు నిద్రలేచి మంటలు ఆర్పి, 108 అంబులెన్స్‌ల ద్వారా ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.