గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 ఏప్రియల్ 2023 (17:28 IST)

సీఎం జగన్ హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం.. ఇదేం తొలిసారి కాదు..

jagan
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అధికారుల్లో టెన్షన్ మొదలైంది. నార్పల నుంచి పుట్టపర్తికి హెలికాప్టర్‌లో జగన్ వెళ్లాల్సి ఉండగా, లోపం కారణంగా రోడ్డు మార్గంలో వెళ్లాల్సి వచ్చింది. 
 
ముఖ్యమంత్రి ముందుగా గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి వెళ్లి అనంతరం ప్రత్యేక హెలికాప్టర్‌లో నార్పలకు చేరుకున్నారు. జగన్ ప్రత్యేక విమానం, హెలికాప్టర్లలో సాంకేతిక సమస్యలు తలెత్తడం ఇది తొలిసారేమీ కాదు. 
 
గతంలోనూ ఇలాంటి సమస్యలు తలెత్తిన సందర్భాలు రెండు మూడు ఉన్నాయి. టెక్నికల్‌ స్యాగ్‌ వల్ల అసౌకర్యానికి గురైన జగన్‌ తన యాత్రను కొనసాగించి సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకున్నారు.