శుక్రవారం, 1 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 19 ఏప్రియల్ 2023 (16:22 IST)

గత ఎన్నికల్లో కోడికత్తి - బాబాయ్ హత్య అంటూ ప్రచారం చేసి గెలిచాం : ఆర్ఆర్ఆర్

raghuramakrishnamraju
సొంత పార్టీపై వైకాపా రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోమారు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో కోడికత్తి దాడి కేసు, బాబాయి వివేకా హత్య కేసు అంటూ బిక్క మొహం వేసుకుని ప్రచారం చేయడం వల్లే తమ పార్టీ గెలిచిందని, వచ్చే ఎన్నికల నాటికి సీన్ రివర్స్ అవుతుందని రఘురామకృష్ణంరాజు అంటున్నారు. 
 
ఆయన బుధవారం ఢిల్లీలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత వంద మంది సలహాదారులను నియమించుకున్నారన్నారు. అలాంటి జగన్ సొంతంగా రాష్ట్రాభివృద్ధికి ఎలాంటి సలహా ఇస్తారని ప్రశ్నించారు. 
 
రాష్ట్ర భవిష్యత్ కోసం, అభివృద్ది కోసం పోరాటం సొంతంగా ఏం సలహాలు ఇవ్వగలరని ఎద్దేవా చేశారు. ఇంకెన్ని రోజులు పోలవరం, ప్రత్యేక హోదా అంటూ కాలం గడుపుతారని నిలదీశారు. వివేకా బాబాయ్ హత్య కేసుల, కోడికత్తితో దాడి అంటూ అబద్ధాలు చెప్పి గత ఎన్నికల్లో తమ వైకాపా గెలిచిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏం చెప్పి ప్రజలను మోసం చేస్తారని నిలదీశారు. జగనన్న వసతి దీవెన పథకానికి డబ్బులు లేకపోవడం వల్లే మొన్న బటన్ నొక్కలేదని ఆర్ఆర్ఆర్ అన్నారు.