శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 30 మే 2023 (23:01 IST)

అనంతపురంలో కొత్త ఫ్రాంచైజీ స్టోర్‌ను ప్రారంభించిన మేక్‌మైట్రిప్

Anantapuram
భారతదేశంలోని ప్రముఖ ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీ మేక్‌మై ట్రిప్ అనంతపురంలో కొత్త ఫ్రాంచైజీ స్టోర్‌ను ప్రారంభించింది. విజయవాడ, తిరుపతి, గుంటూరు అనంతరం అనంతపురంలో ప్రారంభించిన అవుట్‌లెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేక్‌మైట్రిప్‌కు నాల్గవది. ఫ్రాంచైజ్ నెట్‌వర్క్ విస్తరణ అనేది భారతదేశంలోని టాప్ 100+ నగరాల్లోని వినియోగదారులకు సేవలందించేందుకు మేక్‌మైట్రిప్ విస్తృత వ్యూహంలో భాగం. ఫ్రాంచైజ్ నెట్‌వర్క్ తాము విశ్వసించే వారితో మాట్లాడటం, వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన సేవలను అందించడంలో సహకరించనుంది.
 
ఆంధ్ర ప్రదేశ్ నుంచి బుక్ చేస్తున్న మొదటి మూడు విదేశీ గమ్యస్థానాలుగా ఐరోపా, థాయ్‌లాండ్ మరియు బాలి ఉండగా, భారతదేశంలో ఇష్టపడుతున్న గమ్యస్థానాలలో కశ్మీర్, కేరళ మరియు అండమాన్ దీవులు ఉన్నాయి. దీని గురించి మేక్‌మైట్రిప్‌లోని హాలిడేస్ అండ్ ఎక్స్‌పీరియన్స్ బిజినెస్ హెడ్ జస్మీత్ సింగ్ మాట్లాడుతూ, ‘‘అనంతపురంలో ఒక కొత్త స్టోర్‌ను ప్రారంభించడం ద్వారా మా ఫిజికల్ ఇంటర్‌ఫేస్‌ను విస్తరించడం మాకు చాలా ఆనందంగా ఉంది. మేము పరపతితో హైపర్-లోకల్ మార్కెటింగ్ కనెక్షన్‌ని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. అనంతపురం వంటి నగరంలో ట్రావెల్ సముదాయాలను రాపటు చేసేందుకు వీరు మా భాగస్వామిగా వ్యవహరిస్తారు. ఈ ప్రయత్నానికి మాకు వచ్చిన స్పందన సానుకూలంగా ఉంది. అన్ని ఫ్రాంచైజీలలో సేవ స్థిరంగా ఉండేలా సాంకేతికత మరియు శిక్షణలో కూడా మేము పెట్టుబడి పెట్టాము’’ అని వివరించారు.
 
అనంతపురంలోని మేక్‌మైట్రిప్ ఫ్రాంచైజీ స్టోర్ భాగస్వాములు కె.చామండేశ్వరి, నీలావతి నటరాజ్ మాట్లాడుతూ, “మేక్‌మైట్రిప్‌తో కలిసి పని చేయడం మరియు అనంతపురంలోని ప్రయాణికుల ప్రయోజనాల కోసం సాంకేతికతతో కూడిన వనరులను ఉపయోగించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఏడు నిమిషాలలోపు ఏదైనా ప్రశ్న ఆధారంగా ప్రయాణ ప్రణాళికను రూపొందించే మేక్‌మైట్రిప్ యాజమాన్య టూల్ ‘MMTOne’ని (ఎంఎంటిఒన్) ఉపయోగించడాన్ని మా బృందం ఇప్పటికే నేర్చుకోవడం ప్రారంభించింది. ఆన్-ప్లాట్‌ఫారమ్ సర్టిఫికేషన్‌ల కోసం మేము ఇ-లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, ‘ILearn’పై (ఐలెర్న్) కూడా మేము ఆధారపడ్డాము’’ అని వివరించారు.