గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (08:08 IST)

అనంతలో రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు.. అడ్రెస్ అడిగి..?

Chain snatching
Chain snatching
అనంతపురంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. అనంతపురం నారంగా ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున ఓ మహిళ చైన్ స్నాచింగ్‌ జరిగింది. పట్టపగలు ఓ మహిళ నగలు దోచుకెళ్లారు. 
 
నారంగాలోని 5వ రహదారిలో తన ఇంటి ముందు శుభ్రం చేస్తున్న మహిళ మెడలోని బంగారాన్ని, పల్సర్ బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు దోచుకెళ్లారు. 
 
దారి అడిగే నెపంతో ఆమె వద్దకు వచ్చిన ఓ వ్యక్తి చుట్టుపక్కల ఎవరూ లేరని తెలుసుకుని ఆమె మెడలోని గొలుసు లాక్కెళ్లారు. ఈ ఘటన వీధిలో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.