సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 21 ఫిబ్రవరి 2023 (23:15 IST)

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ఓలా ఎలక్ట్రిక్ మొదటి అనుభవ కేంద్రం ప్రారంభం

ola electric
భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ ఓలా ఎలక్ట్రిక్, అనంతపురంలోని రుద్రంపేటలోని కళ్యాణదుర్గం రోడ్‌లో కొత్త ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించడంతో అనంతపురంలో తన D2C ఫుట్‌ప్రింట్‌ను విస్తరించనున్నట్లు ప్రకటించింది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఇప్పటికే ఇటువంటి 200 ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు కలిగి ఉండగా, కంపెనీ తన నెట్‌వర్క్‌ను మార్చి 2023 నాటికి 500 అవుట్‌లెట్‌లను చేర్చేందుకు చర్యలు తీసుకుంటోంది.
 
అన్ని సేవలను ఒకేచోట అందించాలన్న లక్ష్యంతో, ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్లలో ఈవీ (EV) ఔత్సాహికులు ఓలా అందుబాటులోకి తీసుకు వచ్చిన ఈవీ సాంకేతికత వివరాలు తెలుసుకునేందుకు, వాటి పనితీరును సొంతంగా తెలుసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. వినియోగదారులు S1 మరియు S1 ప్రో టెస్ట్ రైడ్‌లను చేసేందుకు ఓలా బ్రాండ్ ఛాంపియన్‌ల నుంచి కొనుగోలుకు సహకారాన్ని అందుకునేందుకు, ఫైనాన్సింగ్ ఎంపికల వివరాలు తెలుసుకునుందకు, ఓలా యాప్‌లో వారి కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసేందుకు కూడా అనుమతిస్తుంది. ఈ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లు అన్ని పోస్ట్ సేల్స్ కేర్ మరియు ఓలా స్కూటర్‌ల నిర్వహణ కోసం వన్-స్టాప్ డెస్టినేషన్లుగా రెండింటి పనితీరును అందిస్తాయి.
 
ఓలా వరుసగా ఐదు నెలల పాటు ఈవీ 2వీలర్ల సేల్స్ చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉండడంతో పాటు దేశ వ్యాప్తంగా 200,000 కన్నా ఎక్కువ మంది వినియోగదారులను కలిగి ఉంది. ఓలా ఎలక్ట్రిక్ నేడు భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ 2వీలర్ల పరిశ్రమలో కీలక స్థానంలో కొనసాగుతోంది.
 
భారతదేశం ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను మరింత వేగవంతం చేస్తూ, కంపెనీ తన ‘లవ్ ఆన్ 2 వీల్స్’ ప్రచారంతో ఓలా S1 ప్రోపై రూ.12,000 తగ్గింపు మరియు దాని హైపర్‌చార్జర్ నెట్‌వర్క్‌కు ఒక ఏడాది పాటు ఉచిత యాక్సెస్‌తో సహా ప్రత్యేకమైన ఆఫర్‌లను విడుదల చేసింది. అదనంగా, వినియోగదారులు ఇప్పుడు జీరో డౌన్ పేమెంట్‌తో ఓలా స్కూటర్‌ను ఇంటికి తీసుకెళ్లవచ్చు. అలాగే, రూ.2,499 నుంచి ప్రారంభమయ్యే ఈఎంఐలను ఎంచుకోవచ్చు, 8.99% నుంచి తగ్గిన వడ్డీ రేట్లు మరియు జీరో ప్రాసెసింగ్ రుసుమును పొందవచ్చు మరియు ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్‌లపై అదనపు తగ్గింపులను పొందవచ్చు. వీటితో పాటు, వినియోగదారులు తమ పెట్రోల్ స్కూటర్‌లను సరికొత్త ఓలా S1ల కోసం ఎక్ఛేంజ్ చేసుకునే అవకాశంతో పాటు రూ.4,000 వరకు బోనస్‌ను పొందవచ్చు. ఓలా ప్రస్తుత వినియోగదారులు ఓలా మనీలో రూ.6,000 వరకు పొందడం ద్వారా #EndICEage రెఫరల్ ప్రోగ్రామ్ నుంచి ప్రయోజనం పొందవచ్చు.
 
ఓలాఇటీవలే ‘ఓలా కేర్’ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఇది తన సర్వీస్ నెట్‌వర్క్‌కు 360 డిగ్రీల యాక్సెస్‌ను అందిస్తుంది. ఇది వినియోగదారులకు వారి ఇంటి వద్ద లేదా వారికి సమీపంలోని ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లలో అందుకునేందుకు అనుమతిస్తుంది. ఓలా కేర్ మరియు ఓలా కేర్+ సబ్‌స్క్రిప్షన్‌ల ద్వారా, కస్టమర్‌లు ఇంట్లో ఉన్నా లేదా మారుమూల ప్రాంతంలో ఉన్నా సమగ్రమైన సేవ మరియు సహాయ కవరేజీని కూడా కంపెనీ అందిస్తుంది. వినియోగదారులు ఇప్పుడు S1 & S1 ప్రో రెండింటికీ ఓలా కేర్+ సబ్‌స్క్రిప్షన్‌పై 50% వరకు తగ్గింపును పొందుతారు.