గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 ఫిబ్రవరి 2023 (09:32 IST)

టీడీపీలో చేరనున్న మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ

kanna - cbn
ఇటీవల భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నేత కన్నా లక్ష్మీనారాయణ ఈ నెల 23వ తేదీన తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. టీడీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పార్టీలో చేరేందుకు సిద్ధమైపోయారు. ఈ మేరకు ఆదివారం తన ముఖ్య అనుచరులతో నిర్వహించిన కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులోభాగంగా, 23వ తేదీ మధ్యాహ్నం భారీ ర్యాలీగా కన్నా గార్డెన్ నుంచి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వరకు భారీ ర్యాలీగా వెళ్లి టీడీపీ కుండవా కప్పుకోనున్నారు. 
 
బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన ఆదివారం తన అనుచరులతో ఏకంగా 4 గంటల పాటు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. ఇందులో భవిష్యత్ ప్రణాళికతో పాటు ఏ పార్టీలో చేరితో బాగుంటుందన్న అంశాలపై తన అనుచరులను అడిగి ఆయన అభిప్రాయాలు తెలుసుకున్నారు. వీరంతా తెలుగుదేశం పార్టీలో చేరాని ముక్తకంఠంతో చెప్పారు. దీంతో ఆయన టీడీపీ కండుపా కప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. 
 
ఇందుకోసం ఈ నెల 23వ తేదీన గుంటూరులోని కన్నావారి తోటలోని తన నివాసం నుంచి తమ మద్దతుదారులు, అనుచరులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకుంటారు. అక్కడ చంద్రబాబు సమక్షంలో టీడీపీ సభ్యత్వం స్వీకరిస్తారు. ఆయనతో పాటు బీజేపీకి రాజీనామా చేసిన పలువురు నేతలు కూడా అదే రోజున టీడీపీలో చేరనున్నారు.