గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 21 జూన్ 2020 (13:35 IST)

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం : మరో 439 పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఫలితంగా గడచిన 24 గంటల్లో మరో 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో మొత్తం 24451 శాంపిల్స్‌ను పరీక్షించగా ఈ కేసులు బయటపడినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. అలాగే, 24 గంటల్లో 151 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
 
మరోవైపు, ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 7,059 అని పేర్కొంది. ఏపీలో చికిత్స తీసుకుంటున్న ఇతర రాష్ట్రాలు, దేశాల వారితో కలిపి మొత్తం 8,929 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 3,599 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 3,354 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 106 కి చేరింది. 
 
రాష్ట్రంలోని 13 జిల్లాల వారీగా నమోదైన పాజిటివ్ కేసులను పరిశీలిస్తే, అనంతపురంలో మొత్తం కేసులు 800, చిత్తూరులో 562, ఈస్ట్ గోదావరిలో 555, గుంటూరులో 768, కడపలో 388, కృష్ణలో 1048, కర్నూలులో 1294, నెల్లూరులో 471, ప్రకాశంలో 180, శ్రీకాకుళంలో 59, విశాఖపట్టణంలో 300, విజయనగరంలో 84, వెస్ట్ గోదావరిలో 550 చొప్పున నమోదు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో నమోదైన పాజిటివ్ కేసుల సంక్య 1540గా ఉంది.