ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 27 నవంబరు 2021 (09:49 IST)

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫ్యాను గాలి - 11 స్థానాలు వైకాపా ఖాతాలోకి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన జరిగిన శాసనమండలి ఎన్నికల్లో అధికార వైకాపా ఫ్యాను గాలి వీచింది. మొత్తం 11 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అన్ని స్థానాలు ఆ పార్టీ ఖాతాలోకి వెళ్లాయి. దీంతో శాసనమండలిలో ఆ పార్టీ బలం ఏకంగా 31కి పెరిగింది. కొత్త సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం గమనార్హం. 
 
వీరిలో తూమాటి మాధవరావు (ప్రకాశం), ఇందుకురూ రఘురాజు (విజయనగరం), వై.శివరామిరెడ్డి (అనంతపురం), ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావు (గుంటూరు),  కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ (చిత్తూరు), అనంత ఉదయభాస్కర్ (తూర్పుగోదావరి), మొండితో అరుణ్ కుమార్, తలశిల రఘురాం (కృష్ణా జిల్లా), వంశీకృష్ణ యాదవ్, వి.కళ్యాణి (విశాఖ)లు గా ఎన్నికయ్యారు. 
 
ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఇందులో వైకాపా అభ్యర్థులు మాత్రమే పోటీలో మిగిలారు. దీంతో వైకాపా సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.