ఢిల్లీ నాయుడు, ఆంధ్రా నాయుడు హీరోలుగా ఇద్ద‌రు మోస‌గాళ్ళు సినిమా... సూప‌ర్ హిట్!

విజ‌య‌వాడ ‌: ప‌్ర‌త్యేక హోదా పేరుతో సినిమా మొద‌లుపెట్టి... చివ‌రికి దాన్ని ప్ర‌త్యేక ప్యాకేజీగా టైటిల్ మార్చ‌డంతో ఎన్.డి.ఎ. సినిమా సూప‌ర్ ఫ్లాప్ అయింద‌ని సిపిఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ పేర్కొన్నారు. ఇద్ద‌రు మోస‌గాళ్ళు, పిరికిపంద‌ల వ‌ల్ల ఆంధ్ర‌ప

venkaiah-babu
JSK| Last Modified సోమవారం, 19 సెప్టెంబరు 2016 (14:41 IST)
విజ‌య‌వాడ ‌: ప‌్ర‌త్యేక హోదా పేరుతో సినిమా మొద‌లుపెట్టి... చివ‌రికి దాన్ని ప్ర‌త్యేక ప్యాకేజీగా టైటిల్ మార్చ‌డంతో ఎన్.డి.ఎ. సినిమా సూప‌ర్ ఫ్లాప్ అయింద‌ని సిపిఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ పేర్కొన్నారు. ఇద్ద‌రు మోస‌గాళ్ళు, పిరికిపంద‌ల వ‌ల్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఈ దుస్థితి ఏర్ప‌డింద‌ని విమ‌ర్శించారు. ఢిల్లీ నాయుడు వెంక‌య్య‌ నాయుడు, ఆంధ్ర నాయుడు చంద్ర‌బాబు నాయుడులు మోస‌గాళ్ళుగా చ‌రిత్ర‌లో మిగిలిపోతార‌న్నారు.

అస‌లు వీరిద్ద‌రినీ హీరోలుగా పెట్టి... ఇద్ద‌రు మోస‌గాళ్ళు అని సినిమా తీస్తే హిట్టే అన్నారు. సినిమా ఫ్లాప్ అయ్యాక ప‌బ్లిసిటీ మెటీరియ‌ల్ పంపిన‌ట్లు, వెంక‌య్య‌ను ఇక్క‌డికి పంపార‌ని ఎద్దేవా చేశారు. వెంక‌య్య‌ రెండుసార్లు స‌న్మానాలు చేయించుకోవడం విచిత్ర‌మ‌ని... ఒక‌సారి ప్ర‌త్యేక హోదా తెస్తున్నాడ‌ని స‌న్మానం చేశారు. ఇపుడు ప్ర‌త్యేక ప్యాకేజీ పేరుతో రెండోసారి స‌న్మానం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు.

ప్యాకేజీ వ‌ల్ల లాభం రెండున్న‌ర ల‌క్ష‌ల కోట్లు అని వెంక‌య్య‌నాయుడు చెపుతుంటే, లేదు 75 వేల కోట్ల‌ని చంద్ర‌బాబు అంటార‌ని, ఇందులో ఏది వాస్త‌వ‌మ‌ని రామృకృష్ణ ప్ర‌శ్నించారు. ఈ ఇద్ద‌రు పిరికిపంద‌ల‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో మాట్లాడే ద‌మ్ములేక రాష్ట్రానికి అన్యాయం చేశారని రామ‌కృష్ణ ఆరోపించారు.దీనిపై మరింత చదవండి :