శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 7 అక్టోబరు 2017 (13:00 IST)

బావ మరదలిని చంపేశాడు.. భార్యను భర్త కొడవలితో నరికేశాడు..

మహిళలపై దారుణాలు పెచ్చరిల్లిపోతున్నాయి. గ్యాంగ్ రేప్‌లతో పాటు హత్యా నేరాల సంఖ్య పెరిగిపోతోంది. జీడిమెట్లలో శనివారం దారుణం వెలుగులోకి వచ్చింది. సౌమ్య అనే విద్యార్థిని బావ కృష్ణయ్య హత్య చేశాడు. సౌమ్య మర

మహిళలపై దారుణాలు పెచ్చరిల్లిపోతున్నాయి. గ్యాంగ్ రేప్‌లతో పాటు హత్యా నేరాల సంఖ్య పెరిగిపోతోంది. జీడిమెట్లలో శనివారం దారుణం వెలుగులోకి వచ్చింది. సౌమ్య అనే విద్యార్థిని బావ కృష్ణయ్య హత్య చేశాడు. సౌమ్య మరొక వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతోందనే కోపంతో బావ ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆమె సంఘటనా స్థలంలో చనిపోవడంతో ఐడిఎల్ చెరువులో పడేశాడు. తరువాత నిందితుడు కూకట్ పల్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. 
 
మరోవైపు భార్యను భర్త కొడవలితో నరికి చంపిన ఘటన వనపర్తి జిల్లాలోని పానగల్ మండలం వెంగళాయపల్లిలో జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య లక్ష్మిని (28) భర్త చంద్రశేఖర్ రెడ్డి నరికి చంపేశాడు. ఘటనా స్థలంలోనే బాధితురాలు మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుడు చంద్రశేఖర్ రెడ్డి పరారీలో ఉన్నాడు.