శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 3 అక్టోబరు 2017 (17:48 IST)

విషమించిన శశికళ భర్త నటరాజన్ ఆరోగ్యం... పెరోల్‌పై రానున్న చిన్నమ్మ

అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ భర్త నటరాజన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గత కొన్ని రోజులుగా చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ భర్త నటరాజన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గత కొన్ని రోజులుగా చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మూత్రపిండాలు, కాలేయం ఫెయిలూర్స్ కావడంతో ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆసుపత్రి వర్గాలు సోమవారం రాత్రి విడుదల చేసిన మెడికల్ బులిటెన్‌లో తెలిపారు. 
 
'నటరాజన్‌‌కు ప్రస్తుతం లివర్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స అందిస్తున్నాం. ప్రొఫెసర్ మహమ్మద్ రేలా సారథ్యంలో వైద్యం జరుగుతోంది. మూత్రపిండాలు, కిడ్నీ చెడిపోవడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విమమంగానే ఉంది' అని ఆసుపత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. 
 
లివర్ ఫంక్షన్ దిగజారిపోతోందని, లివర్, కిడ్నీ మార్పిడి కోసం ఆయన ఎదురుచూస్తున్నారని పేర్కొంది. కాగా, తన భర్త ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా తనకు పెరోల్‌ ఇవ్వాలని కోరుతూ శశికళ కర్ణాటకలోని పరప్పణ అగ్రహార జైలు అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఆమెకు ఈనెల 5వ తేదీన పెరోల్ మంజూరు కావొచ్చని తెలుస్తోంది.