Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆడపిల్ల పుట్టిందని భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు..

Updated: శనివారం, 29 డిశెంబరు 2018 (10:51 IST)
ఆడపిల్ల పుట్టిందని.. భర్త ముఖం చాటేశాడు. రెండో పెళ్లి చేసేసుకున్నాడు. న్యాయస్థానాన్ని ఆశ్రయించినా.. పోలీసులకు చెప్పినా ఫలితం లేకపోయింది. దీంతో చేసేదిలేక చివరికి కుమార్తెతో కలిసి భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఈ ఘటన తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జమ్మికుంటకు చెందిన లాస్యకు గజ్జెల శివశంకర్‌తో 2014లో వివాహం జరిగింది. 
 
వివాహం సమయంలో అమ్మాయి తరపు వారు నాలుగు లక్షల కట్నం ఇచ్చుకున్నారు. అయితే పెళ్లయ్యాక, లాస్యకు పాప పుట్టాక శివశంకర్ అసలు స్వరూపం బయటపడింది. అమ్మాయి పుట్టిందని లాస్యను అదనపు కట్నం తెమ్మని వేధించాడు. భర్త శివశంకర్‌తో పాటు అత్తమామలు, ఆడపడుచులు వేధించడం మొదలుపెట్టారు. చివరికి పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించినప్పటికీ ఎలాంటి ఫలితం రాలేదు. దీంతో  లాస్య పుట్టింటికి వచ్చింది. 
 
అయితే తాను లేని సమయంలో భర్త నాగలక్ష్మి అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడని తెలుసుకుని గతేడాది జూన్ 6న జమ్మికుంట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు, న్యాయస్థానాన్ని ఆశ్రయించినా.. ఎలాంటి ఫలితం లేకపోవడంతో.. చివరికి భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న పోలీసులు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆమె ఆందోళనను విరమించింది.

అన్నీ చూడండి

ఎక్కువ మంది స్టార్లు ఉన్న చిత్రాల్లో నటించేందుకు జంకుతాను : నయనతార

మానసిక ప్రశాంతత కోసం సోషల్ మీడియా గుడ్‌బై... 'ప్రేమలు' బ్యూటీ వెల్లడి

'వారణాసి' నుంచి కీలక అప్‌డేట్ - 'రుద్ర' ఫస్ట్‌లుక్ రిలీజ్

Toxic: trailer: బోల్డ్, రా, వైల్డ్, క్రేజీ, అంశాలతో యష్..కియారా అద్వానీ చిత్రం టాక్సిక్: ట్రైలర్

Allari Naresh: కీలక సన్నివేశాల చిత్రీకరణలో రంభ ఊర్వశి మేనక

తర్వాతి కథనం
Show comments