సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 3 జనవరి 2018 (15:30 IST)

బాలికపై బస్సు డ్రైవర్ అత్యాచారం... ఆపై రూ.1.50 లక్షలకు బేరం

విశాఖపట్టణం జిల్లాలో ఓ దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న బాలిక అత్యాచారానికి గురైంది. ఈమె పని చేసే కంపెనీ బస్సు డ్రైవరే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

విశాఖపట్టణం జిల్లాలో ఓ దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న బాలిక అత్యాచారానికి గురైంది. ఈమె పని చేసే కంపెనీ బస్సు డ్రైవరే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆ బాలికను నమ్మించి బస్సులోనే అత్యాచారం చేయడం కాకుండా, చేసిన నేరం బయటకు పొక్కకుండా ఉండేందుకు రూ.1.50 లక్షలకు బేరమాడాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
విశాఖలోని వీఈపీజెడ్‌లోని ప్రైవేట్‌ కంపెనీలో గిరిజన బాలిక పనిచేస్తోంది. ఈ కంపెనీ బస్సుడ్రైవర్‌ విశ్వానాథ్‌ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. ఆ బాలిక విధులు ముగించుకుని ఇంటికి వెళ్లుతున్న సమయంలో బస్సు డ్రైవర్‌ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. 
 
ఆ తర్వాత విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు రూ.1.50 లక్షలు చెల్లించేందుకు ముందుకు వచ్చాడు. అయితే, ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా పడి పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు విశ్వనాథ్‌ అతనికి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.