సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 జనవరి 2020 (16:47 IST)

జగన్ రెడ్డికి ఎర్త్ పెట్టిన ప్రధాని మోదీ.. ఆ ప్రాంతానికి ఒక్కటే రాజధాని..?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి షాకిచ్చారు. బుధవారం ప్రధాని అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.  కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఉన్న డయ్యూ డామన్ - దాద్రా నగర్ హవేలీలకు డామన్‌ను రాజధానిగా మోదీ సర్కార్ నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జావదేకర్  మీడియా ద్వారా తెలియజేసారు.
 
ఈ నిర్ణయం ఏపీకి కూడా వర్తిస్తుందని అప్పుడే చర్చ మొదలైంది. ఇదే నిర్ణయాన్నే ప్రధాని ఏపీకి కూడా అమలు చేసేలా ప్రణాళిక రూపొందిస్తారని తెలుస్తోంది. ఇంకా మూడు రాజధానులకు కేంద్రం మద్దతు వుందనే వైసీపీ ప్రచారానికి కేంద్రం నిర్ణయంతో ఒక్కసారిగా షాక్ తగిలింది. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
 
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం మూడు రాజధానుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. రాజధానిని ఒక ప్రాంతం నుంచి మరో రెండు ప్రాంతాలకు చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే నిర్ణయానికి కేబినేట్, అసెంబ్లీ ఆమోదం తెలిపినా.. మండలి మాత్రం ఆమోదించలేదన్న విషయం తెలిసిందే.