శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 ఫిబ్రవరి 2022 (14:45 IST)

కదిరి దోపిడీ హత్య, కేసు.. నిందితుడి అరెస్ట్

కదిరి పట్టణంలో జరిగిన దండుపాళెం లాంటి దోపిడీలో నిందితుడిని అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని దేవెనహళ్లికి చెందిన షఫీవుల్లా గత కొన్నేళ్లుగా కదిరి నివాసం వుంటున్నాడు. మంగళవారం కదిరి పట్టణానికి సమీపంలో నిందితుడు  ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు.
 
కదిరి పట్టణం ఎన్జీవో కాలనీలో గత సంవత్సరం నవంబరు 16న జరిగిన హత్య, దోపిడీ కేసులో నిందితుడు షఫీవుల్లాను కదిరి పట్టణ పోలీసులు అరెస్ట్ చేశఆరు. 
 
ఎన్జీవో కాలనీలో ఇంట్లో నిద్రిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఉషారాణిపై దాడి చేసి 50 తులాలకు పైగా బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. పక్కింట్లో ఉన్న శివమ్మ అనే మరో మహిళపై దాడి చేసి గాయపరిచి బంగారు నగలను కాజేశారు. 
 
ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. దీనిపై 50కి పైగా పోలీసుల బృందాలు నిందితుల కోసం గాలించారు. ఎట్టకేలకు ఓ నిందితుడిని గుర్తించారు.