సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (12:36 IST)

భార్య శవాన్ని 70 ముక్కలు చేసిన టెక్కీ... ఎక్కడ?

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌లో ఓ టెక్కీ అత్యంత దారుణానికి పాల్పడ్డాడు. అనుమానంతో భార్యను చంపేశాడు. అంతటితో అతని కసి తీరలేదు. దీంతో భార్య మృతదేహాన్ని 70 ముక్కలు ముక్కలుగా నరికాడు. తాజాగా వెలుగుల

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌లో ఓ టెక్కీ అత్యంత దారుణానికి పాల్పడ్డాడు. అనుమానంతో భార్యను చంపేశాడు. అంతటితో అతని కసి తీరలేదు. దీంతో భార్య మృతదేహాన్ని 70 ముక్కలు ముక్కలుగా నరికాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఉత్తరాఖండ్‌, డెహ్రాడూన్‌కు చెందిన రాజేశ్ అనే టెక్కీ భార్య అనుపమతో కలిసి నివశిస్తూ వచ్చాడు. వీరిద్దరికీ 1999లో వివాహం జరిగింది. ఆ తర్వాత అమెరికాకు వెళ్లి 2008లో డెహ్రాడూన్‌కు తిరిగి వచ్చారు. డెహ్రాడూన్‌కు తిరిగి వచ్చిన తర్వాత భార్యాభర్తల మధ్య కలతలు చెలరేగాయి. కోల్‌కత్తాకు చెందిన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నావని భర్తను అనుపమ పదేపదే నిలదీస్తూ వచ్చింది. దీంతో ఇరువురికి మధ్య గొడవలు జరుగుతూ వచ్చాయి.
 
దీంతో ఆగ్రహించిన రాజేశ్... 2010 అక్టోబర్ 17వ తేదీ రాత్రి భార్య అనుపమతో గొడవ పడి హత్య చేశాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో అనేక దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భార్య శవాన్ని 70 ముక్కలు చేసి డీప్ ఫ్రీజర్‌లో రెండు నెలల పాటు దాచి పెట్టినట్టు వాంగ్మూలంలో వెల్లడించాడు. దీనిపై స్థానిక కోర్టులో విచారణ జరుగగా, టెక్కీని దోషిగా తేల్చింది.