గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : బుధవారం, 26 జులై 2017 (12:42 IST)

డ్రగ్స్ స్కామ్... ఇక హైదరాబాద్ టెక్కీల వంతు.. ఐటీ కంపెనీలకు వార్నింగ్

హైదరాబాద్‌లో వెలుగుచూసిన డ్రగ్స్ స్కామ్‌లో భాగ్యనగరిలోని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కూడా ఉన్నట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి. పలువురు టెక్కీలు మత్తుమందు వాడుతున్నట్టు తేలింది. దీంతో పలు ఐటీ కంపెనీలకు తెలంగ

హైదరాబాద్‌లో వెలుగుచూసిన డ్రగ్స్ స్కామ్‌లో భాగ్యనగరిలోని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కూడా ఉన్నట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి. పలువురు టెక్కీలు మత్తుమందు వాడుతున్నట్టు తేలింది. దీంతో పలు ఐటీ కంపెనీలకు తెలంగాణ ఎక్సైజ్ అధికారులు హెచ్చరికలు పంపారు. 
 
హైదరాబాద్ నగరంలో దాదాపు నాలుగు లక్షల మందికి పైగా ఐటీ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో పలువురికి డ్రగ్స్ స్కామ్‌లో పోలీసులు అరెస్టు చేసిన ప్రధాన నిందితుడు కెల్విన్‌తో పాటు మొహమ్మద్ అబ్దుల్ వాహిద్, మొహమ్మద్ అబ్దుల్ ఖుద్దూస్‌లతో సంబంధాలు ఉన్నట్టు సమాచారం. 
 
ఇలాంటి వారిలో 40 మంది టెక్ నిపుణులను గుర్తించి, వారికి నోటీసులు జారీ చేయడం జరిగింది. నిందితుల సెల్‌ఫోన్లు, కాల్‌డేటా, మెసేజ్ డేటా నుంచి ఈ సమాచారం సేకరించారని, వివరాలను ఐటీ మంత్రిత్వ శాఖకు పంపగా, వారు సదరు కంపెనీలను హెచ్చరించారని ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు.