శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: బుధవారం, 14 సెప్టెంబరు 2016 (12:23 IST)

తెలుగుదేశం ఎమ్మెల్యే సౌమ్యకు డెంగ్యూ...? ఆంధ్రా హాస్పిట‌ల్‌లో చేరిక‌

నందిగామ‌: కృష్ణా జిల్లా నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. జ్వరంతో బాధపడుతున్న ఎమ్మెల్యేని గొల్లపూడిలోని ఆంధ్రా హాస్పిట‌ల్‌లో చేర్చారు. డెంగ్యూ లక్షణాలు ఉన్నట్లు అనుమానంతో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

రెండేళ్ళ క్రితం సౌమ్య తండ్రి తంగిరాల ప్ర‌భాక‌ర్ రావు ఎమ్మెల్యేగా ఉంటూ, గుండెపోటుతో మృతి చెందారు. త‌ర్వాత ఆయ‌న స్థానంలో నిల‌బ‌డి బై ఎల‌క్ష‌న్‌లో సౌమ్య నందిగామ ఎమ్మెల్యే అయ్యారు. సౌమ్య ఆరోగ్యం మెరుగుప‌డాల‌ని నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లు ఆకాంక్షిస్తూ, ప్రార్థన‌లు చేస్తున్నారు.