బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 26 జనవరి 2022 (14:34 IST)

దూరపు ఆలోచనతో పాలన సాగిస్తున్న సీఎం జ‌గ‌న్... అందుకే కొత్త జిల్లాలు

రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు పై డిప్యూటీ సీఎం అంజాద్ బాష సానుకూలంగా కామెంట్స్ చేశారు. కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటు అభినందనీయం అన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన విధంగా ఒక్కో హామీ నెరవేర్చుతున్నార‌ని ముఖ్యమంత్రిని కొనియాడారు. 
 
 
వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం అనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచ‌న అని, ఇపుడు 26 జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందిస్తామ‌ని చెప్పారు. కొత్త జిల్లాల‌తో ఇలాంటి మహత్త‌ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం హర్షణీయం అన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆలోచన అన్నారు. 
 
 
విభజన అనంతరం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింద‌ని, అయినా దూరపు ఆలోచనతో ముఖ్యమంత్రి పాలన సాగిస్తున్నార‌ని అంజాద్ భాషా అన్నారు. వికేంద్రీకరణ తో అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలు కూడా అభివృద్ధి బాటలో నడుస్తాయ‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త జిల్లాల ఏర్పాటును ప్రజలు స్వాగతిస్తున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తామని గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హామీ ఇచ్చార‌ని, దానిని ఇపుడు నెర‌వేచ్చార‌న్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించి పరిపాలన అందిస్తున్నార‌ని, కులాలు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నార‌ని వివ‌రించారు.