Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిక్కిరిసిన భక్తజనం.. తిరుమలలో అపశృతి.. భక్తుడు మృతి

Written By సెల్వి
Updated: శుక్రవారం, 15 జులై 2022 (11:09 IST)
శ్రీవారి సర్వదర్శనానికి అన్ని కంపార్టుమెంట్‌లో భక్తులు వేచి వున్నారు. సర్వదర్శనాన్ని రద్దు చేసి.. క్యూలైన్లలో నేరుగా భక్తులను అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీవారి సర్వదర్శనానికి అన్ని కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. కిక్కిరిసిన భక్తజనం కారణంగా తిరుమల దర్శన క్యూలైన్‌లో వేచియున్న భక్తుడు మృతిచెందాడు. 
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని కాంచీపురం జిల్లాకు చెందిన వేదాచలం అనే భక్తుడు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల దర్శనానికి వచ్చాడు. శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా క్యూ లైన్‌లో సృహ తప్పి పడిపోయిన వేదాచలం అనే భక్తుడు పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు.
 
క్యూలైన్‌లో రద్దీ ఎక్కువగా ఉండటంతో ఊపిరాడక వేదాచలం కళ్లు తిరిగి కిందపడిపోయాడు. వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించారు. హుటాహుటినా సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
 
కానీ, మార్గ మధ్యలోనే వేదాచలం మృతి చెందాడు. ఆస్పత్రిలో అతన్ని పరిక్షించిన వైద్యులు అతడు మరణించినట్టు ధృవీకరించారు. దాంతో మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. 
 
భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో వేదాచలం కిందపడిన వెంటనే బయటకు తీసుకు వచ్చేందుకు కుటుంబ సభ్యులు తీవ్ర అవస్థలు పడాల్సి వచ్చిందంటూ వాపోయారు. 

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments