Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారి దర్శనం, ఇలా ఆన్లైన్లో రిలీజ్, అలా భక్తులు బుక్

Written By జె
Updated: సోమవారం, 29 జూన్ 2020 (22:56 IST)
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్సనానికి ఆన్లైన్ టిక్కెట్లను ఎప్పుడూ ఆన్లైన్లో ఉంచినా భక్తులు పెద్దఎత్తున బుక్ చేసేసుకుంటున్నారు. ఆ స్వామివారిని దర్సించుకోవడానికి భక్తులు మరింత ఉత్సాహం చూపిస్తున్నారు. లాక్‌డౌన్ నిబంధనల సడలింపుల తరువాత ఆలయం తెరుచుకోవడం దర్శనానికి సంబంధించిన టోకెన్లను ఈ నెల 10వ తేదీ నుంచి అందించడం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు ఆన్లైన్‌లోను, ఆఫ్‌లోను కౌంటర్ల ద్వారా టోకెన్లను అందిస్తున్నారు.
 
కరోనాను దృష్టిలో ఉంచుకుని భక్తుల సంఖ్యను విడతలవారీగా పెంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం ఆన్‌లైన్లో జూలై నెలకు సంబంధించిన టోకెన్లను విడుదల చేశారు. ప్రతిరోజు భక్తులు 9 వేల టోకెన్ల వరకు ఆన్‌లైన్లో బుక్ చేసుకోవచ్చు.
 
ఇక కౌంటర్ల ద్వారా అయితే 30వ తేదీ నుంచి ఇవ్వనున్నారు. అయితే ఆన్‌లైన్లో ఇప్పటికే సగానికి పైగా టిక్కెట్లను భక్తులు బుక్ చేసేసుకున్నారట. కేవలం 300 రూపాయల శీఘ్ర దర్సనం మాత్రమే ఉన్న నేపథ్యంలో భక్తులు టోకెన్లను వెంటవెంటనే బుక్ చేసేసుకుంటున్నారని టిటిడి అధికారులు భావిస్తున్నారు.
 
గతంలో సేవా టిక్కెట్లను ఆన్లైన్లో విడుదల చేసే వెంట వెంటనే బుక్ చేసుకునేవారని, ఇప్పుడైతే 300 రూపాయల టోకెన్లనే భక్తులు ఎక్కువగా బుక్ చేసుకుంటున్నారన్న అభిప్రాయం టిటిడి అధికారుల నుంచి వ్యక్తమవుతోంది.

అన్నీ చూడండి

Varun Tej: అభిమానుల పట్ల మరోసారి పెద్ద మనసు చాటుకున్న వరుణ్ తేజ్

Sharwa : భోగి కోసం భారీ క్లైమాక్స్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న శర్వా

Ajay Bhupathi: ఆర్‌ఎక్స్ 100 తర్వాత కొత్త వాళ్లతో పని చేయకూడదనుకున్నా : అజయ్ భూపతి

చిన్నప్పుడు మా మావయ్య ఒడిలో కూర్చోబెట్టుకుని అసభ్యంగా ప్రవర్తించేవాడు: నటి శివాంగి

Vijay Deverakonda:.హాలీవుడ్ టెక్నీషియన్స్ స్థాయికి ఎదిగిన విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments