శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 25 జూన్ 2020 (15:36 IST)

శ్రీవారి దర్శనం కోసం భక్తుల సంఖ్యను పెంచనున్న తితిదే

కలియుగ వైకుంఠదైవంగా భావించే శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం కరోనా లాక్డౌన్ వేళ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక చర్యలు తీసుకుంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ శ్రీవారి దర్శనానికి అనుమతి ఇచ్చిన తితిదే... ప్రస్తుతం ప్రతి రోజూ 10 వేల మందిని ఆలయంలోకి అనుమతిస్తోంది. శుక్రవారం నుంచి మరో 3 వేల మంది భక్తులను అదనంగా అనుమతించాలని తితిదే అధికారులు నిర్ణయించారు. 
 
ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఈ నెల 30వ తేదీ వరకూ ప్రతి నిత్యం మరో 3 వేల టిక్కెట్లను టీటీడీ విడుదల చేసింది. జులై మొదటి వారం నుంచి దర్శనం సంఖ్యను మరింత పెంచనుంది. దర్శన సమయంలో కూడా మార్పులు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం 9గంటలకు ఆలయాన్ని మూసివేస్తుండగా... జులై మాసంలో రాత్రి 11 గంటలకు మూసేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.